దాంపత్య జీవితంలో తీపి, చేదు జ్ఞాపకాలు రెండూ ఉంటాయి. ప్రతి జంట ఏదో ఒక సమయంలో కష్ట సమయాలను ఎదుర్కొవలసి ఉంటుంది.

కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల వల్ల కూడా అపార్థాలు తలెత్తుతాయి. దాంపత్య జీవితం ఇరువురి ప్రవర్తన, గౌరవంతోపాటు.. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ, నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.

తరచూ భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే, దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు కనుగొంటే.. సంబంధం మళ్లీ తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది.

పదే పదే కాల్ చేయడం, మెసేజ్ చేయడం కూడా భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది.

భాగస్వామి మిమ్మల్ని విస్మరించడానికి ప్రయత్నిస్తున్నారని మీకు అనిపిస్తే, సరైన సందర్భంలో దాని గురించి చర్చించడం మంచిది.

ఎల్లప్పుడూ భాగస్వామిని నమ్మండి. చిటికీ మాటికీ అనుమానించకండి.. వారితో ఏకాంతంగా గడపండి.

మీ భాగస్వామికి సమయం ఇవ్వలేకపోతున్నారని భావిస్తే, మీరు వారికి కొంత సమయం ఇచ్చి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వండి