కొన్ని ఆహారపదార్థాలు కూడా గర్భం త్వరగా రావడానికి సాయపడతాయి. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పిల్లలుత్వరగా పుట్టే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఆకుపచ్చని కూరగాయలు.. 

పిల్లలు కావాలనుకునేవారు తమ డైట్‌లో ఆకుపచ్చని కూరగాయలని ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఇందులో ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి.

వీటి వల్ల గర్భధారణ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు రెగ్యులర్‌గా తినమని చెబుతుంటారు.

పాలకూర.. ముందుగానే ఆకుపచ్చని కూరగాయల గురించి చెప్పాం కదా.. మరీ ప్రత్యేకంగా పాలకూర గురించి ఎందుకు అనుకుంటున్నారా.. ఇందులోని విటమిన్స్‌ అలాంటివి.

ఇవి కోరికలను పెంచుతాయి. అందుకే పిల్లలు కావాలనుకునేవారు పాలకూరని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పాజిటీవ్‌ రిజల్ట్స్‌ ఉంటాయి.

దానిమ్మ పండ్లు.. పండ్లలో దానిమ్మ పండుకి కూడా సెక్స్‌ కోరికలను పెంచే శక్తి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్‌ స్థాయిలు పెరుగుతాయి.

దీంతో శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుది. ఇది సంతానలేమి సమస్యని దూరం చేస్తుంది. కాబట్టి ఈ పండుని కూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చు.