ఈ సీజన్‌లో ఈగల గోల ఎక్కువగా ఉంటుంది. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచితే.. ఈగలు ఇంట్లోకి అతిథుల్లా వచ్చేస్తాయి.
ఈగలు ఎన్నో సూక్ష్మక్రిములను తీసుకొస్తాయి. అవి ఇంట్లోని పళ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలపై వాలడం ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఒక గ్లాసులో యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని, దానికి కొన్ని చుక్కల డిష్ సోప్ వేయండి. గ్లాసులై ప్లాస్టిక్ ర్యాప్‌ని ఉంచి రబ్బర్ బ్యాండ్ వేయండి.
ఆ తర్వతాత టూత్ పిక్‌తో ప్లాస్టిక్ ర్యాప్‌పై రంధ్రాలు చేయాలి. ఈగలు దానికి ఆకర్షితమై రంధ్రాల ద్వారా గ్లాస్ లోపలికి వెళ్తాయి. మళ్లీ బయటకు రాలేవు.
ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల ఉప్పు తీసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ఈగలపై చల్లాలి. ఇలా చేస్తే ఈగల గోల నుంచి విముక్తి లభిస్తుంది.
పుదీనా, తులసితో కూడా ఈగలను తరిమికొట్టవచ్చు. వీటిని పొడి లేదా పేస్ట్ తయారు చేసి నీటిలో కలపాలి.
ఈ నీటిని ఈగలపై పిచికారీ చేయండి. ఇది పురుగుమందుల వంటి ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా మీ ఇంట్లోకి ఈగలు రావు.
వీనస్ ఫ్లైట్రాప్ ప్లాంట్‌ను ఇంటి బయట లేదా లోపల 1-2 మూలల్లో ఉంచండి. ఈ మొక్కల నోరు తెరిచి ఉంటుంది. ఒకవేళ ఈగలు వచ్చి దానిపై కూర్చుంటే.. ఈ మొక్కలు వెంటనే పట్టుకుంటాయి