చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. రాత్రి వేళ నిద్రపోకపోతే మరుసటి రోజు ఉదయం ఎనర్జిటిక్‌గా ఉండరు.
నిద్ర లేకపోవడం వల్ల కూడా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది.
రాత్రి నిద్ర పట్టలేక ఇబ్బంది పడుతుంటే కొన్ని చిట్కాలను అనుసరించడం మంచిది. దీనిద్వారా పడుకున్న వెంటనే నిద్రపోవడం ఖాయం..
మంచి నిద్ర కోసం నిద్రించడానికి, లేవడానికి మీ సమయం నిర్ధారించుకోవడం ముఖ్యం. నిర్ణీత సమయానికి నిద్రపోకపోతే నిద్రలేమి సమస్య పెరుగుతుంది.
మంచి నిద్ర పొందడానికి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు కుంకుమపువ్వు వేసుకుని తాగండి
పడుకునే ముందు గోరువెచ్చని పాలలో జాజికాయ పొడిని కలుపుకుని తాగితే మంచిగా నిద్ర వస్తుంది.
రాత్రి వేళ ఒక గ్లాస్ పాలు తాగినా, లేదా నూనెతో తల, పాదాలకు మసాజ్ చేస్తే త్వరగా నిద్రపడుతుంది