గుండె ఆరోగ్యం: ఫోలిక్ యాసిడ్ గుండె ఆరోగ్యానికి మద్దతుగా పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా, గుండె సంబధిత రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాద స్థాయిని తగ్గిస్తుంది.

ఫోలిక్ యాసిడ్ ఎక్కువుగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఒత్తిడి సమస్య నుంచి ఉప శమనం లభిస్తుంది.

రక్తహీనతతో బాధపడేవారు ఫోలిక్ యాసిడ్ ఎక్కువుగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్) రోగులకు ఆహారంలో విటమిన్ డి, సితో పాటు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహార పదార్థాలు అవసరం.

గర్భిణులు ఫోలిక్ యాసిడ్ ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా నవజాత శిశువులో న్యూరల్ ట్యూబ్ లోపాల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

రక్తకణాల ఉత్పత్తికి ఫోలిక్ యాసిడ్ అవసరం. తాజా ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లభిస్తుంది

నోట్‌: కేవలం ఈవిషయాలు సమాచారం కోసం మాత్రమే. మరిన్ని వివరాల కోసం నిపుణులను సంప్రదించండి.