శీతాకాలంలో కామెల్లియాస్ ఆశ్చర్యకరంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల పుష్ప జాతిగా ఉంటుంది. అవి చల్లని గాలులు వీచినంత కాలం ఈ పుష్పాలు వికసిస్తుంటాయి.

వింటర్ జాస్మిన్.. ఈ శీతాకాలంలో మీ తోటకి మరింత అందం వింటర్ జాస్మిన్. వీటి నిర్వహణా వ్యయం, శ్రమ తక్కువ. ఇవి పసుపు రంగులో పూసే పూలు. జనవరి ప్రారంభంలోనే వికసిస్తుంటాయి.

పెటునియా..Petunia శీతాకాలంలో మీ తోటను మరింత ప్రకాశవంతం చేయడానికి పెటునియాస్ మంచి ఎంపిక.పెటునియాస్ తెలుపు, పసుపు, గులాబీ, ముదురు క్రిమ్సన్, నలుపు, ఊదా వంటి అనేక షేడ్స్‌లో వస్తాయి.

పాన్సీ..Pansy శీతాకాలపు పువ్వుగా పాన్సీని పరిగణిస్తారు. ఇది దాదాపు అన్ని రంగుల షేడ్స్ లో లభిస్తుంది. పాన్సీలు తక్కువగా పెరిగే మొక్కలు. నీడలో కూడా బాగా వృద్ధి చెందుతాయి.

ఇంగ్లీష్ ప్రింరోస్.. ఈ పువ్వులు శీతాకాలంలో మీ తోటను మరింత అందంగా మార్చేస్తాయి.ఇవి తెలుపు, పసుపు, నారింజ నుండి నీలం, గులాబీ, ఊదా రంగు వరకు దాదాపు అన్నిరకాల రంగులో పూస్తుంటాయి. ఇంగ్లీష్ ప్రింరోస్ శీతాకాలం మధ్యకాలం నుండి వికసిస్తుంది.

కాలెంన్డ్యులా.. కాలెంన్డ్యులా, సాధారణంగా దీనిని పాట్ మారీ గోల్డ్ అంటారు. కుండీలు,ప్లాంటర్స్ లో బాగా పెరుగుతాయి. పసుపు, నారింజ వివిధ రంగుల్లో ఈ పూలు పూస్తుంటాయి.

స్వీట్ అలిసమ్.. ఈ పువ్వులు తేలికపాటి మంచును తట్టుకోగలవు. అవి దృడంగా ఉన్నందున, వాటిని శీతాకాలం అంతా ఎటువంటి సంకోచం లేకుండా పెంచవచ్చు. ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా కూడా, సూక్ష్మమైన తీపి సువాసనను కలిగి ఉంటాయి