ఆస్తమా ఉన్నవారు, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు ఈ 5 మూలికలను ఇంట్లో వాడటం మేలు.

ముఖ్యంగా ఊపిరితిత్తులు బాగా పనిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. అవేంటో తెలుసుకుందాం.

Ginger: శ్వాస సరిగా అందని వారికి కలిగే ఛాతి నొప్పి, మంటను అల్లం తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఇది అడ్డుకుంటుంది.

Peppermint : ఇది శ్వాస సంబంధిత మంటను తగ్గించి.. శ్వాస నాళాలు తెరచుకునేలా చెయ్యగలదు. తద్వారా ఊపిరి పీల్చుకోవడం తేలికవుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఉన్నవారికి పుదీనా బాగా పనిచేస్తుంది. 

Turmeric : ఇది కూడా శ్వాస సంబంధిత సమస్యలను దూరం చెయ్యగలదు. ఇది ఛాతిలో మంట, నొప్పిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను పోగొడుతుంది.

Tulsi : తులసి ఎంత మంచిదో చెప్పాల్సిన పనిలేదు. రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి తులసి మనల్ని కాపాడగలదు. అలాగే శ్వాస సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో రక్త ప్రవాహం చక్కగా సాగేలా చెయ్యగలదు.

Pippali : మన ఇండియాలో కొంతమంది వంటింట్లో దీన్ని కూడా బాగా వాడుతారు. ఎందుకంటే ఇది జలుబు, దగ్గును బాగా తగ్గించగలదు. ఆయుర్వేదంలో దీన్ని బాగా వాడుతారు. ముసలివారికి శ్వాస సమస్యల్ని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.