చాలా సులభంగా రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది
ఇంతకీ మ్యాప్స్‌ను ఉపయోగించి రైలు ఎక్కడుంది.? ఎలాంటి తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఇందు కోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ యాప్ ఉంటే దానిని అప్‌డేట్ చేసుకోవాలి.
అనంతరం యాప్‌లోకి వెళ్లి మీరు వెళ్లే రైల్వే స్టేషన్‌ను యాప్‌లో సెర్చ్ చేసి దానిపై క్లిక్ చేయండి
వెంటనే ఆ స్టేషన్ నుంచి రైళ్లకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.
వీటిలో మీరు ఎక్కాల్సిన రైలుపై క్లిక్ చేయాలి
వెంటనే మీ రైలు ఎక్కడ ఉంది.? ఏ సమయానికి స్టేషన్‌కు వస్తుంది లాంటి వివరాలు కనిపిస్తాయి