ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే

ఎన్టీఆర్30 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అప్‌డేట్స్‌ కోసం తారక్‌ ఫ్యాన్స్‌ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నటించనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది

అయితే తాజాగా నేడు సోమవారం జాన్వీ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం

ఈ నేపథ్యంలో ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది మూవీయూనిట్

ఈ పోస్టర్ లో  జాన్వీ హాఫ్ సారీలో పక్కా పల్లెటూరు అమ్మాయిగా సముద్రం ఒడ్డున కూర్చొని  కనిపిస్తుంది

కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది