‘వీరసింహారెడ్డి’గా ఈ సంక్రాంతికి సందడి చేసిన బాలయ్య.. ఇప్పుడు దసరా బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురిగా కనిపించనుంది
కాగా ప్రస్తుతం ఈ చిత్రం కోసం రూ.5కోట్ల ఖర్చుతో గణేశుడిపై సాగే ఓ పాటను తెరకెక్కిస్తోంది చిత్ర బృందం
దీని కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ సెట్‌ను కూడా సిద్ధం చేశారు మూవీ మేకర్స్
ఆ సెట్‌లోనే బాలయ్య, శ్రీలీలపై ఎంతో గ్రాండ్‌గా ఈ పాటను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది
బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న ఈ పాటకి తమన్ మ్యూజిక్ అందించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహిస్తున్నారు