అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
బాలయ్య కూతురిగా శ్రీలీల ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇందులో భాగంగానే బాలయ్యపై ఓ భారీ ఫైట్ సీన్ రూపొందేస్తున్నట్లు సమాచారం.
ఈ సన్నివేశం వెంకట్ మాస్టర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ జరుగుతుంది.
చిత్రానికి ఎంతో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ కానున్న ఈ షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.
బాలకృష్ణ ఇమేజ్‌కు మాస్ యాక్షన్ కథాంశంతో అనిల్ తెరకెక్కుస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.