32 జట్లు, 64 మ్యాచ్‌లు.. ఫిఫా సమరానికి వేళాయే.. పూర్తి వివరాలు..

FIFA వరల్డ్ కప్ 2022 ప్రారంభం కావడానికి కొన్ని వారాలే సమయం ఉంది.

దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫిఫా సందడే కనిపిస్తోంది.

నవంబర్ 20 నుంచి ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

ఫైనల్ డిసెంబర్ 18న జరగనుంది. 22వ ఎడిషన్ నిర్వహణకు ఖతార్‌ సిద్ధమైంది.

మొత్తం 32 జట్లు ఫిపా వరల్డ్ కప్ 2022లో బరిలోకి దిగనున్నాయి.

22వ ఎడిషన్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి.

8 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

లుసైల్, అల్ బైట్, ఖలీఫా, అహ్మద్ విన్ అలీ, స్టేడియం 974, అల్ తుమా, అల్ వక్రా, ఎడ్యుకేషన్ స్టేడియంలో పోటీలు జరగనున్నాయి.