సమంత.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ చిన్నది.

నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు జరుపుకుంటుంది.

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సామ్.

తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది సామ్.

మహేష్ బాబుతో నటించిన దూకుడు, పవన్ కళ్యాణ్ తో నటించిన అత్తారింటికి దారేది సినిమాలు ఈ అమ్మడి రేంజ్ ను పెంచేశాయి.

తెలుగులోనే కాదు తమిళంలోనూ  సూర్య, విజయ్, విక్రమ్ లాంటి హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది.

కెరీర్ పీక్ లో ఉండగానే ప్రేమించిన అక్కినేని నాగ చైతన్యను పెళ్ళాడి కొన్నేళ్ళకే విడిపోయింది సామ్.

ఆ తర్వాత  ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడింది  సామ్.

ఇక ఈ అమ్మడు పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆమె అభిమానులు, పలువురు సినీ తారలు కోరుకుంటూ సామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.