అప్పుడప్పుడు చేసే ఉపవాసంతో మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయాన్నే ఆరోగ్య నిపుణులే స్వయంగా చెబుతున్నారు.
ప్రస్తుత మానవ ప్రవంచంలో మనిషిని వేధిస్తున్న గుండె జబ్బులకు ఉపవాసంతో చెక్ పెట్టవచ్చంట.
శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగానే ఇలా జరుగుతుండగా ఫాస్టింగ్ అనేది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో..
సహాయవడుతూ ప్రమాదాన్ని నివారిస్తుంది. నచ్చిన సమయంలో అనుసరించే ఇలాంటి ఉపవాసం వల్ల..
కేవలం గుండె ఆరోగ్యమే కాకుండా ఇతర అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
సమయానికి తిన్నా, తినకపోయినా వ్యాయామం చేసినా, చేయకపోయినా... ఈ రోజుల్లో గుండె జబ్బు మరణాలు పెరుగుతున్నాయి.
అందుకే తీసుకునే ఆహారం మూలంగా కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెకు ప్రమాదం 'చేకూరకుండా ఉండేందుకు..
అడపా దడపా ఉపవాసం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.