06 November 2023
అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న వాయు కాలుష్యం..
దేశంలో రోజు రోజుకు వాయు కాలుష్యం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నది.
పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమలు వెదజల్లే కార్బన్‌డైయాక్సైడ్ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి.
వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది.
శరీరంలో కాలి వేలు నుంచి మొదలు తల వరకు గాలి కాలుష్యం వల్ల ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాడీలోని ప్రతి పార్ట్‌ను ఎయిర్ పొల్యూషన్ అనారోగ్యం పాలయ్యేలా చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
వాయు కాలుష్యం వల్ల ముందుగా స్థూల కాయం, ఆ తర్వాత ఆస్తమాకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
వాతావరణం కలుషితమైన ప్రాంతాల్లో నివసించే వారిలో చాలా మందిని ఈ రెండు సమస్యలు వెంటాడుతున్నాయి.
ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న వారి ఆరోగ్యం వాయు కాలుష్యం మూలంగా మరింత ప్రమాదకరంగా మారుతుంది.
వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోనట్లయితే భవిష్యత్తులో ఈ సమస్య మరింత జటిలం అయ్యే ప్రమాదం ఉంది.
చిన్నా పెద్దా తేడా లేకుండా వాయు కాలుష్యం అన్ని వయసుల వారి శ్వాసకోస ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపుతుంది.
తల్లి గర్భంలో ఉన్న శిశువులపై కూడా వాయు కాలుష్యం ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి