TV9 Telugu

చలికాలంలో వాకింగ్‌కు వెళ్తున్నారా.? అయితే ఇవి పాటించాల్సిందే.!

23 December 2023

చలి సమయంలో వాకింగ్‌ వెళ్లే ముందు శరీరమంతా కవర్ అయ్యేలా దుస్తులను కప్పుకొని బయటకు వెళ్లాలి.

తల నుండి కాళ్ల వరకు మిమ్మల్ని మీరు కవర్‌ చేసుకోవాలి. చలికాలంలో వేగంగా నడవడం లేదా పరిగెత్తడం అస్సలు చేయరాదు.

ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నెమ్మదిగా నడవడం ప్రారంభించి, ఆ తర్వాత వేగం పెంచుకోవచ్చు.

ఉదయం 8.30 నుండి 9.30 మధ్య లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య వాకింగ్‌ చేస్తే బెటర్‌.

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలంలో వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమం.

గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా లేదా న్యుమోనియా ఉన్నట్లయితే ఉదయం వాకింగ్‌ను అవాయిడ్‌ చేయాలి.

ఆరోగ్యవంతులు శీతాకాలంలో కనీసం వారానికి 5 రోజులు అరగంట పాటు నడవడానికి ప్రయత్నించాలి.

వాస్తవానికి, నిపుణులు ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవాలని సిఫార్సు చేస్తున్నారు.