TV9 Telugu

శీతాకాలంలో చల్లని నీళ్లతో స్నానం చేస్తున్నారా? ప్రమాదం అంచున మీరున్నట్లే!

23 December 2023

కొందరు ఏడాది పొడవునా చల్లటి నీళ్లతో స్నానం చేస్తుంటారు. 

కానీ చలికాలం వచ్చిందంటే కాస్త గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం బెటర్‌ అంటున్నారు నిపుణులు. 

కాస్త చిన్న వయసు వారు  చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. కానీ వృద్ధాప్యం సమీపించేవారు చలికాలంలో చల్లటి స్నానం చేయడం హానికరం. 

చలికాలంలో తలపై చల్లటి నీరు పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

తలపై చల్లటి నీరు పోసుకోవడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్తపోటు ఒక్కసారిగా పెరుగుతుంది. 

అలాగే మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే అడ్రినాలిన్ హార్మోన్ వేగంగా విడుదలవుతుంది. .

వయసు పెరిగే కొద్దీ మెదడు కణాలు కూడా బలహీనపడతాయి. అటువంటి పరిస్థితిలో రక్తపోటు పెరిగితే ప్రమాదం స్థాయి పెరుగుతుంది.