పాన్ ఇండియా సినిమా ‘పుష్ప–2 ది రూల్‌’  షూటింగ్‌లో పాల్గొనేందుకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త లుక్‌తో గురువారం విశాఖ వెళ్లారు 

రాత్రి 10 గంటలకు ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి విశాఖలో ల్యాండ్ అయ్యారు బన్నీ

విశాఖ విమానాశ్రయంలో ఫాన్స్ ఐకాన్ స్టార్ కు ఘన స్వాగతం పలికారు

బన్నీను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు విమానాశ్రయనికి తరలివచ్చారు 

పోలీసులు కూడా ఐకాన్ స్టార్ రక్షణ కోసం విమానాశ్రయం బయట భారీగా  బందోబస్తు ఏర్పాటు చేశారు

అయినప్పటికీ బన్నీ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి బయటకు రావడంతోనే ఫాన్స్ సెల్ఫీల కోసం ఆయన్ను చుట్టుముట్టరు

ఇటీవ‌లే పుష్ప 2 మూవీ హైద‌రాబాద్‌లో కొన్నిరోజుల పాటు చిత్రీక‌ర‌ణ జరుపుకొని తాజా షెడ్యూల్‌ను వైజాగ్‌లో షూట్ చేయనున్నారు

అందులో భాగంగా హీరో అల్లు అర్జున్‌పై కీల‌క ఘట్టాలను వైజాగ్ లో చిత్రకరించనున్నారు

ఫిబ్ర‌వ‌రి నుంచి ర‌ష్మిక మంద‌న్న కూడా సెట్స్ లోకి అడుగు పెట్ట‌నుంది