బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్.. నటి సమంతకు వీరాభిమాని.
ఆమె నటనతో పాటు పలు సేవా కార్యక్రమాలకు, చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవకు ఆకర్షితుడైయ్యాడు.
అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు పునర్జన్మ ప్రసాదిస్తున్న ఆమెపై అభిమానం రెట్టింపవ్వడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు.
తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయ కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు.
తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయ కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు.
ఈ నెల 28వ తేదీన ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్ తెలిపారు.
ఇప్పటి వరకూ సమంతను నేరుగా చూడలేదని, కేవలం ఆమెపై అభిమానంతోనే గుడి నిర్మిస్తున్నట్లు చెప్పారు.