చిత్ర ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్‌’ ఒకటి.

‘పుష్ప’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ హీరోగా  టైటిల్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుంది.

ఈ చిత్ర తొలి భాగంలో ఇన్‌స్పెక్టర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ తన నటనతో ఆకట్టకున్నారు.

రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్ర మరింత శక్తిమంతంగా ఉండనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఫహాద్‌పై ఓ కీలక షెడ్యూల్‌ ముగించినట్లు ప్రకటించింది  చిత్ర బృందం.

ఈ మేరకు సెట్లో ఫహాద్‌, సుకుమార్‌ కలిసి ఉన్న ఓ వర్కింగ్‌ స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసారు మేకర్స్.

‘‘భన్వర్‌ సింగ్‌ షెకావత్‌తో ‘పుష్ప2’ కీలక షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఈసారి అతను ప్రతీకారంతో తిరిగి వస్తాడు’’ అని ఓ వ్యాఖ్యను జత చేసింది చిత్ర బృందం.

ఇటీవలే మారేడుమిల్లి, ఒడిస్సా పలు ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుంది ఈ చిత్రం.