నిప్పుకోడి ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల పక్షి

ఇది గాలిలో ఎగరలేనప్పటికీ జంప్ చేయడం ద్వారా 3 నుంచి 5 మీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు

దీని గుడ్డు 6 అంగుళాల పొడవు, 5 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది

నిప్పుకోడి అత్యంత ఎత్తైన, బరువైన పక్షి. మగ నిప్పుకోడి పొడవు 9 అడుగుల వరకు ఉంటుంది. ఆడ నిప్పుకోడి 6 అడుగుల వరకు ఉంటుంది

దీని బరువు 100 నుంచి 150 కిలోల వరకు ఉంటుంది. ఇది మొక్కలు, కీటకాలు, చిన్న జీవులను మాత్రమే తింటుంది

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పక్షుల పాదాలకు సాధారణంగా మూడు లేదా నాలుగు వేళ్లు ఉంటాయి. కానీ నిప్పుకోడికి 2 మాత్రమే ఉంటాయి

నిప్పుకోడి ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆత్మరక్షణ విషయానికి వస్తే అది దాని కాళ్ళను ఉపయోగిస్తుంది

దీని పొడవాటి కాళ్ళు చాలా శక్తివంతమైనవి. ఒక్క దెబ్బలో మనిషిని చంపగలదు