కన్నడకు చెందిన ఒక హీరోయిన్ తెలుగులో సత్తా చాటుకోవడానికి వస్తోంది.. ఆవిడే ఆశికా రంగనాథ్
కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న అమీగోస్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. మరి ఈ బ్యూటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం
కన్నడలో 2016లో తెరకేక్కిన క్రేజీ బాయ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత శివరాజ్ కుమార్ హీరోగా చేసిన మాస్ లీడర్ సినిమాలో నటించింది.
అంతేకాకుండా పునీత్ రాజకుమార్ హీరోగా నటించిన జేమ్స్ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది ఈ అమ్మడు. కన్నడ ఇండస్ట్రీలో నటించిన ఈ భామ ఇతర ఇండస్ట్రీలో కూడా నటించలేదు.
అయితే 2022లో అధర్వ హీరోగా నటించిన “పట్టాతు అరసన్” మూవీతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న అమిగోస్ లో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.