హీరో శర్వానంద్‌ దర్శకుడు మేర్లపాక గాంధీ యు.వి.క్రియేషన్స్‌ది హిట్ కాంబో

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్ పై వచ్చిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’

2016లో విడుదలై ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది

అయితే ఇప్పుడీ ఈ కాంబినేషన్‌ లో మరో చిత్రం రానున్నట్లు సమాచారం

ఇటీవలే శర్వాకు మేర్లపాక గాంధీ వినిపించిన ఓ కథ ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది

ఈ చిత్రాన్ని కూడా యువీ సంస్థే నిర్మిస్తుందని సమాచారం

అయితే శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే

ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఈ కొత్త చిత్రం పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది