ఉత్తర ప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్య రామజన్మ భూమిగా ప్రసిద్ధి. స్కంధ పురాణంలో అయోధ్యను ఏడు పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు
విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన శ్రీ కృష్ణుడు దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం ద్వారక. సప్తపురి క్షేత్రాల్లో ద్వారక కూడా ఒకటి. సంస్కతంలో ద్వార అంటే ప్రవేశం అని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం
భారతదేశంలోని పురాతన నగరం వారణాసి. హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఇక్కడ శివుడు నివసిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ నగరంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం
శ్రీకృష్ణుడి జన్మస్థానం ఉత్తర ప్రదేశ్ లో ఉన్న మధుర. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ మరియు గోవర్ధన్ కొండకు సమీపంలో ఉంది. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకూ మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది
హరిద్వార్ అంటే గంగా ద్వారమని.. విష్ణువు ద్వారం అని అర్దం. ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళాలో లక్షల మంది పవిత్ర స్నానాలు చేస్తారు
సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచిపురం. వేగావతి నది ఒడ్డున ఉన్న కంచిని వెయ్యి దేవాలయాల నగరం, బంగారు నగరం అని కూడా పిలుస్తారు
మధ్యప్రదేశ్ ఉజ్జయినీ క్షిప్రా నదీ తీరంలో వెలిసిన పుణ్యక్షేత్రం. సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. వైష్ణవులకు, ఇటు శైవులకు పవిత్రమైన నగరం. మహాకాళేశ్వర దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి