టీ20 ప్రపంచ కప్ 2022 పూర్తి సమాచారం ఒక్క క్లిక్‌లో.. తెలుసుకోండిలా..
T20 ప్రపంచ కప్ ఆదివారం (అక్టోబర్ 16) నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది.
టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇందులో 12 జట్లు సూపర్-12లో తలపడనున్నాయి.
టీ20 ప్రపంచం 2007లో ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఆస్ట్రేలియా వేదికగా ఎనిమిదో ఎడిషన్ జరగనుంది. వెస్టిండీస్ మాత్రమే 2సార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
2010 నుంచి ప్రతి రెండేళ్లకోసారి టీ20 వరల్డ్‌కప్ నిర్వహించగా, 2016 తర్వాత ఐదేళ్ల గ్యాప్ వచ్చింది.
2020లో కరోనా కారణంగా ప్రపంచకప్ నిర్వహించలేకపోయారు.
2018లో టోర్నీ జరగాల్సి ఉన్నా.. ద్వైపాక్షిక సిరీస్‌ల కారణంగా నిర్వహించ లేకపోయారు.
ఈ ప్రపంచకప్‌లో ఆటలో పరిస్థితులు కొత్తగా కనిపించనున్నాయి.
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొన్ని నిబంధనలను మార్చింది. ఇది ప్రపంచ కప్‌లో మొదటిసారి కనిపించనున్నాయి.
నాన్-స్ట్రైకర్ బౌలింగ్ చేయడానికి ముందు రనౌట్ కావడం, స్లో ఓవర్ రేట్ కోసం ఎక్కువ మంది ఫీల్డర్‌లను సర్కిల్‌లో ఉంచడం కనిపిస్తుంది.
గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.
గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా సూపర్-12కు చేరాయి.
అక్టోబరు 16 నుంచి తొలి రౌండ్‌లో శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ, నమీబియా, ఐర్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, జింబాబ్వే పోటీ పడనున్నాయి.
రెండు గ్రూపుల నుంచి మొత్తం 4 జట్లు సూపర్-12కి చేరుకుంటాయి.
అక్టోబర్ 16న ప్రారంభ మ్యాచ్ నిర్వహించనుండగా, ఫైనల్ నవంబర్ 13న జరగనుంది.
హోబర్ట్, సిడ్నీ, పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి.