ఆన్‌లైన్‌లో సులభంగా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు

ముందుగా ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్(www.epfindia.gov.in) ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత ఈ-పాస్‌బుక్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి

ఈ పాస్‌బుక్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయ‌గానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆ కొత్త పేజిలో UAN నంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి

లాగిన్ కాగానే ఖాతాలో ఉన్న పీఎఫ్‌ మొత్తానికి సంబంధించిన వివ‌రాలు క‌నిపిస్తాయి

SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుంబ‌ర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి.. 77382 99899 నంబ‌ర్‌కు మెసేజ్ చేయాలి

అలాగే మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇస్తే కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు