ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది.. ‘రంగబలి’ హీరోయిన్ యుక్తి తరేజ..
తన మాతృ భాష హిందీ కావడంతో ‘రంగబలి’ కోసం తెలుగులో పెద్ద డైలాగులు నేర్చుకొని చెప్పడం సవాల్‌గా అనిపించిందిని అన్నారు యుక్తి తరేజ.
'ఈ విషయంలో డైరెక్షన్ టీమ్‌కి థ్యాంక్స్. అలాగే దర్శకుడు పవన్‌గారు స్క్రిప్ట్‌ని ముందే నాకు ఇవ్వడంతో కొంచెం సులభం అయింది' అని తెలిపారు ఆమె.
పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన చిత్రం ‘రంగబలి’.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ యుక్తి తరేజ మాట్లాడుతూ–'మాది హరియాణ. ఢిల్లీ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశాను.
ఆ తర్వాత మోడలింగ్ మొదలుపెట్టి యాక్టింగ్ ఆడిషన్స్ ఇచ్చాను. ‘లుట్ గయ్..’ అనే పాట మంచి పేరు తీసుకొచ్చింది.
పవన్‌గారు ఆడిషన్ చేసి ‘రంగబలి’ కి ఎంపిక చేశారు. నా మొదటి సినిమాకే నాగశౌర్యగారితో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
తెలుగులో నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉంది.
హీరోయిన్స్‌లో అనుష్క శెట్టిగారు అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగులో కొన్ని కథలు వింటున్నాను' అని తెలిపారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి