రీసెంట్ డేస్లో డైరెక్ట్ రిలీజ్‌లకన్నా.. రీ రిలీజ్‌లే ఎక్కువ బజ్ చేస్తున్నాయి. అటు ఫ్యాన్స్‌ను.. ఇటు సినిమా లవర్స్‌ను థియేటర్ల వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి.
అయితే ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. తాజాగా మరో సారి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ముందుకు వస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
అయితే రావడమే కాదు.. ఈ సారి నవంబర్ సీజన్ అంతా అదుర్స్‌తో ఊగిపోనుందనే దిమ్మతిరిగే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు.
రీసెంట్గా ఎన్టీఆర్ సింహాద్రి లాంటి వింటేజ్ యాక్షన్ ను.. సిల్వర్ స్క్రీన్‌పై విట్ నెస్ చేశారు యంగ్ టైగర్ డైహార్డ్ ఫ్యాన్స్.
అయితే ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాను రీ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు.
దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ డిమాండ్ ను నోట్ చేసుకున్న అదుర్స్ మేకర్స్ .. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ పై సూపర్ క్రేజీ అనౌన్స్ మెంట్ చేశారు.
టైగర్ ఎన్టీఆర్.. డ్యూయల్ రోల్లో ఇరగదీసిన అదుర్స్ సినిమా.. నవంబర్ 18న ఎంపిక చేసిన థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
అయితే ఈ అనౌన్స్ మెంట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. యంట్ టైగర్ ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేస్తోంది.