మిరాయ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న కుర్ర భామ రితిక నాయక్ 

29 August 2025

Rajeev 

రితిక నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు మీద దూసుకుపోతున్న హీరోయిన్. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

కానీ ఈ సినిమా తర్వాత అమ్మడుకు అంతగా ఆఫర్స్ రాలేదు. నాని నటించిన హాయ్ నాన్న మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.

ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మిరాయ్ సినిమాలో నటిస్తుంది. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్  ఆకట్టుకుంది. రితిక పాత్ర  సినిమాలో మెయిన్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమా పై రితిక నాయక్ బోల్డన్ని ఆశాలు పెట్టుకుంది. ఈ సినిమా పక్కా హిట్ అయ్యేలా కనిపిస్తుంది.

ఈ సినిమా తర్వాత రితిక వరుస సినిమాలను లైనప్ చేసింది. వరుణ్ తేజ్, గోపీచంద్‌ సినిమాల్లో నటిస్తుందని తెలుస్తుంది.