అందచందాలు ఫుల్లు.. ఆఫర్స్ మాత్రం నిల్లు..! గ్లామర్ డోస్ పెంచినా.. నో ఛాన్స్..

19 August 2025

Rajeev 

సినిమా ఇండస్ట్రీలో నటిగా సక్సెస్ కావాలంటే అందం, అభినయం ఉన్నప్పటికీ కాస్త అదృష్టం కూడా ఉండాల్సిందే. 

 హీరోయిన్స్ విషయంలో గ్లామర్ పాత్రతోపాటు.. సక్సెస్ అయ్యేందుకు అదృష్టం సైతం కలిసిరావాలి.

 పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నది ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మొదటి చిత్రంలోనే బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది.

తొలి చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తాయని భావించారు అంతా. కానీ అలా జరగలేదు.

ఆమె మరెవరో కాదు.. పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఆ తర్వాత వెంకీమామ, డిస్కో రాజా వంటి చిత్రాల్లో నటించినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు.  చివరిగా మంగళవారం చిత్రంలో నటించింది.

ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది..