చిరు, వెంకీకి పోటీగా బరిలో కుర్ర హీరో.. 

23 September 2024

Battula Prudvi 

సంక్రాంతి అంటేనే సినిమా పండగ. ఆ సీజన్‌లో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కూడా వస్తుంటాయి. 2025లోనూ ఇదే జరగబోతుంది.

ఇప్పటికే చిరంజీవి విశ్వంభర రేసులో ఉంది. వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ముందుగా జనవరి 10న విడుదల కానుంది.

మరోవైపు వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సైతం ఇదే పండక్కి రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది.

మరోవైపు బాలయ్య కూడా సంక్రాంతికే రావాలని ట్రై చేస్తున్నారు. ఈ ముగ్గురు సీనియర్ హీరోల మధ్యలో ఓ చిన్న హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఆయనెవరో కాదు.. సందీప్ కిషన్. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న సినిమాతో ఈయన పొంగల్ బరిలో దిగుతున్నారు.

సంక్రాంతికి ఎప్పుడూ చిన్న సినిమాలకు ఎడ్జ్ ఉంటుంది. కొన్నిసార్లు ఇవే సంక్రాంతి పండగ విన్నర్‎గా నిలుస్తాయి.

శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సంక్రాంతికే భారీ సినిమాల మధ్యలో వచ్చి విజయం సాధించాయి.

2019లోనూ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ఎఫ్ 2 సంచలనం రేపింది. మరి ఈసారి వెంకీ, చిరు, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక.