TV9 Telugu

05 February 2024

హనుమాన్ మూవీ కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: తేజ సజ్జా.

యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్‌ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

దేశీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ నటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

అయితే హనుమాన్ సినిమా కోసం చాలా త్యాగాలు చేశాడట తేజ సజ్జా . చాలా సినిమాల అవకాశాలను వదులుకున్నాడు.

ఈ మేరకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హనుమాన్‌ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడీ యంగ్ హీరో. 

హనుమాన్’ సినిమా పనులు పూర్తి చేయడానికి రెండున్నరేళ్లు పట్టింది. ఈ సమయంలో వేరే సినిమాల గురించి అసలు దృష్టి పెట్టలేదు.

నాకు ఇతర అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో నేను దాదాపు 70 నుండి 75 ప్రాజెక్ట్‌లను తిరస్కరించాను.

అందులో కనీసం 15 ప్రాజెక్టులు బాగున్నాయి. అయితే హనుమాన్ సినిమాకు పూర్తిగా కమిట్ అయ్యాను’ అని తేజ సజ్జా తెలిపాడు.