TV9 Telugu
25 February 2024
ఓ మీమర్ పై సందీప్ కిషన్ సెటైర్లు.! ఫుల్ వైరల్ అవుతున్న వీడియో.
చాలా కాలం తర్వాత ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమాతో బాక్సాఫీస్హి ట్టు అందుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా కొత్త దర్శకులతో కంటెంట్ బేసెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మీమర్స్ తో ప్రెస్ మీట్ నిర్వహించింది ఊరు పేరు భైరవకోన టీం. ఇందులో భాగంగా..
ఓ మీమర్ అడిగిన ప్రశ్నలకు సందీప్ కిషన్ ఫైర్ అయ్యాడు. సరదాగా మాట్లాడుతూనే అతడికి ఫుల్ క్లాస్ తీసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది.
‘మీరు హీరోయిన్ తో అలా చేశారు కదా.. మీరు ఎలా చేశారని నాకు క్యూరియాసిటిగా ఉంది ‘ అంటూ స్టార్ట్ చేశాడు ఓ మీమర్.
అలాగే ఆ మీమర్ మరో క్వశ్చన్ అడిగాడు. ‘మీరు ఇద్దరి హీరోయిన్లతో చేశారు కదా.. ఎవరితో బాగా అనిపించింది’ అంటూ ప్రశ్నించాడు.
దీంతో సందీప్ రియాక్ట్ అవుతూ.. ‘నీ మాతృభాష తెలుగే కదా.! ఆ హీరోయిన్స్ తో చేశారు అనడం కంటే తెలుగులో నటించడం అనే పదం ఉంటుంది.
అంటూ క్లాస్ తీసుకుంటూనే.. ఇద్దరి హీరోయిన్లతో నటించడం బాగుందని చెప్పుకొచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి