TV9 Telugu

11 January 2024

షూటింగ్ లో గాయపడ్డ యంగ్ హీరో నితిన్.. వివరాలు.

సినిమా షూటింగ్ లో యంగ్ హీరో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

తమ్ముడు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నితిన్ కు గాయాలు కావడంతో షూటింగ్ ను నిలిపివేశారని తెలుస్తోంది.

అయితే ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.

మారేడుమిల్లి అడవుల్లో ఓ భారీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో నితిన్ కు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

దాదాపు మూడు వారం రోజుల పడుతుందని అప్పటివరకు నితిన్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారని తెలుస్తోంది.

ఇటీవలే నితిన్ ఎక్స్‌ట్రా – ఆర్డిన‌రి మ్యాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

దాంతో ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిమీదఉన్నడు.