ప్రేమలు బ్యూటీ దూకుడు.. అరడజను సినిమాలతో ఫుల్ బిజీ

september 3

Rajeev 

మమిత 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. 

అయితే ఖో ఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది.

2024లో విడుదలైన ప్రేమలు చిత్రం ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది, ఇది మలయాళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ చిన్నదాని క్రేజ్ డబుల్ అయ్యింది.

దీంతో ఆమెకు తెలుగు నిర్మాతల నుండి ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది.

సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో బలమైన కథాపాత్రలు, మంచి స్క్రిప్ట్‌లతో తెలుగులో అడుగుపెట్టాలని భావిస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో సూర్య సినిమా కూడా ఒకటి.