TV9 Telugu

మడికట్టుకుని కూర్చుంటే అవకాశాలొస్తాయా.? : కృతి శెట్టి.

21 December 2023

‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన కృతిశెట్టి..

ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉంది. అక్కడ వరుసగా మూడు సినిమాల్లో నటిస్తోంది ఈ బెంగళూరు భామ.

కార్తీక్‌కి జోడీగా ‘వా వాతియారే’లో నటిస్తున్న ఈ భామ ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌'ఎల్‌ఐసీలో ప్రదీప్‌ రంగనాథన్‌తో జతకడుతోంది.

వీటితోపాటు ‘జెనీ’లో జయం రవికి జంటగా నటిస్తుంది. ఈ మూడు సినిమాలూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.

ఇక తెలుగులో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తూ.. మొత్తానికి సౌత్‌లోని దాదాపు అన్ని భాషలను కవర్‌ చేస్తుంది కృతిశెట్టి.

తమిళ సినిమాపై ఎక్కువ దృష్టిపెట్టడానికి కారణం పై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది కృతిశెట్టి.

పర్టిక్యులర్‌గా తమిళ సినిమాపైనే దృష్టి పెట్టాను అనడం తప్పనీ .. కథలు వినే క్రమంలో నచ్చిన కథలకు సైన్‌ చేస్తున్నాననీ చెప్పుకొచ్చింది.

తాను నటిని అని నటనకు భాషలతో పనేముందని ప్రశ్నించింది. తాను కన్నడ అమ్మాయే అయినా తెలుగులో బ్రేక్‌ వచ్చిందనీ...

ఒకే భాషలో చేస్తానని మడికట్టుకొని కూర్చుంటే ఇదంతా జరిగేదా, భాషలతో నిమిత్తం లేకుండా చేసుకుంటూ పోవడం ఇదే తన పని అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.