అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్..
27 August 2026
Rajeev
Pic credit - Instagram
చాలా మంది హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు.
ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు.
ఈ అమ్మడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. కృతి శెట్టి.
ఈ చిన్నది తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.
చిన్నతనం కృతి శెట్టి ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్ వంటి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది.
ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. బాలీవుడ్ సినిమాలో నటించింది.
కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో చిన్న పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.