TV9 Telugu
డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన యాత్ర 2 మూవీ.
13 March 2024
వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2. ఈ మూవీ యాత్ర మూవీ సీక్వల్ అనే చెప్పాలి.
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన యాత్ర 2 మూవీలో తమిళ హీరో జీవా నటించారు. ఈ మూవీలో మమ్ముట్టి నటించి మెప్పించారు.
ఎన్నికల సమయంలో పొలిటికల్ అల్లర్ల మధ్య ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
ఏది ఏమైనా థియేటర్లలో ప్రేక్షకుల మెప్పు పొందిన యాత్ర 2 సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునట్టు ప్రకటించారు.
మహా శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ యాత్ర 2 సినిమా ఓటీటీలో వస్తుందని ప్రేక్షకులు అనుకున్నారు. బట్ అలా జరగలేదు.
ఇప్పుడు మార్చి 15 న యాత్ర 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్.
అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 15 లేదా 16 వ తేదీల్లో యాత్ర 2 స్ట్రీమింగ్ కు వస్తుందని టాక్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి