TV9 Telugu
పొలిటికల్ డ్రామాగా ఆర్టికల్ 370.. సూర్య సినిమా మరో హీరో చేతికి..
22 Febraury 2024
యాక్షన్ పొలిటికల్ డ్రామాగా హిందీలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ఆర్టికల్ 370. కొన్ని సంఘటనలు ఆధారంగా రూపొందిన చిత్రమిది.
యామీ గౌతమ్, ప్రియమణి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు ఆదిత్య సుహాస్ దర్శకుడు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీకి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ వాయిస్ అందించారు. యామి గౌతమ్ భర్త ఆదిత్య ధర్ ఈ సినిమాను నిర్మించారు.
బాలీవుడ్ దర్శకుడు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా రాజా శివాజీ పేరుతో హిస్టారికల్ మూవీని రూపొందించబోతున్నట్టుగా వెల్లడించారు.
ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు రితేష్. ఈ సినిమాలో జెనిలియా కీలక పాత్రలో నటించబోతున్నారు.
సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఎనౌన్స్ అయిన వనాంగన్ మూవీ ఇప్పడు మరో హీరో చేతికి వెళ్లింది. అరుణ్ విజయ్ హీరోగా ఈ సినిమాను పూర్తి చేశారు బాల.
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. బాలా మార్క్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి