యమధీర ట్రైలర్ విడుదల..

TV9 Telugu

20 March 2024

భారతదేశ మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఈయన కన్నడ ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా నటించిన ‘కెంపేగౌడ 2’ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు.

‘యమధీర’ పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ట్రైలర్ కార్యక్రమానికి పలువురు సినీ టాలీవుడ్ ఇండస్ట్రీ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

క్రికెటర్ శ్రీశాంత్ పూర్తి పేరు శాంతకుమారన్ నాయర్ శ్రీశాంత్. ఇండియా క్రికెట్ టీంలో చాల మ్యాచ్ లు ఆడారు ఈయన.

6 ఫిబ్రవరి 1983న కేరళలోని కోతమంగళంలో జన్మించిన ఈయన... 2002లో భారతదేశ క్రికెట్ టీంలో జాయిన్ అయ్యారు.

2004లో రంజీ ట్రోఫీ గేమ్‌లో హిమాచల్ ప్రదేశ్‌పై హ్యాట్రిక్ సాధించి శ్రీశాంత్ రికార్డు క్రియేట్ చేసారు.

2006లో ఇంగ్లాండ్ తో భరత్ తరుపున తోలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరుపున గ్రౌండ్ లో దిగారు.