టీవీ 9 నెట్‌వర్క్ ‘నక్షత్ర సమ్మాన్’ అందుకున్న రవీనా టాండన్..
TV9 Telugu
Pic credit - Instagram
దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ‘వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ 2024’ను దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈరోజు ఈ సమ్మిట్ ప్రారంభమయ్యింది.
మొత్తం మూడు రోజులపాటు నిర్వహిస్తుంది. ఇందులో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈరోజు హీరోయిన్ రవీనా టాండన్ పాల్గొంది.
సినీ పరిశ్రమలో రవీనా అందించిన సేవలకుగానూ ఆమెను టీవీ9 నెట్‌వర్క్ నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘నక్షత్ర సమ్మాన్’ అవార్డును అందజేశారు.
అవార్డు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది రవీనా టాండన్. అలాగే టీవీ 9 నెట్‌వర్క్‌కు ధన్యవాదాలు తెలిపింది. అలాగే తనకు కొత్త అనుభూతి కలిగిస్తుందని తెలిపింది.
90వ దశకంలో ప్రసిద్ధి చెందిన తాము.. ఇప్పటికీ అలాగే ఉన్నామని.. ఎప్పుడూ ఇండస్ట్రీలో అప్పుడు ఉన్నట్లే ఉంటామని.. తనను ప్రశంసించిన ప్రతిసారి కొత్త అనుభూతి వస్తుందన్నారు.
తొలి అవార్డ్ అందుకున్నప్పుడు అయినా.. ఇప్పుడు టీవీ9 నక్షత్ర సమ్మాన్ అవార్డ్ అయినా ఎప్పుడూ మంచి అనుభూతి కలుగుతుందని.. ఈ అవార్డ్ తనకు చాలా నచ్చిందని తెలిపింది.
1991లో ‘పత్తర్ కే ఫూల్ ‘చిత్రంతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది రవీనా టాండన్. ఈ చిత్రానికి ‘ఫిల్మ్‌ఫేర్ న్యూ ఫేస్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది.
రవీనా తన కెరీర్‌లో అందాజ్ అప్నా అప్నా, మొహ్రా, దిల్‌వాలే, లాడ్లా, జిద్ది, దీవానా మస్తానా, దుల్హే రాజా, షూల్ వంటి అనేక గొప్ప చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.