అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఓ మై గాడ్. రిలీజియస్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే సీక్వెల్ రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.
సెక్స్ ఎడ్యూకేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఓ మై గాడ్ 2 సినిమా మీద చాల విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి.
ముఖ్యంగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు 27 కట్స్ సూచించటం ఆ తరువాత కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వటం హాట్ టాపిక్ అయ్యింది.
ఎన్నో వివాదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ మై గాడ్ 2 సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో డిజిటల్ రిలీజ్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఓటీటీలో అన్ కట్ వర్షన్ రిలీజ్ అవుతుందన్న న్యూస్ వైరల్ కావటంతో డిజిటల్ ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేశారు.
ఫైనల్‌గా డిజిటల్‌లోనూ సెన్సార్డ్ వర్షన్‌నే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. స్వయంగా అక్షయ్ కుమారే ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెన్సార్ బోర్డ్‌కు గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కి ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. దీంతో అన్ కట్‌వర్షన్ చూడాలనుకున్న ఫ్యాన్స్ మాత్రం ఫీల్ అవుతున్నారు.