TV9 Telugu
హిట్లర్ సీన్ రిపీటవుతుందా?
05 March 2024
సెట్లో మెగాస్టార్ చిరంజీవి.. ఆయన చుట్టూ ఐదుగురు చెల్లెళ్లు అని అనగానే అందరికీ హిట్లర్ రోజులు గుర్తుకొచ్చేస్తున్నాయి కదా...
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది హిట్లర్ గురించి కాదు. విశ్వంభర గురించి. ఈ సినిమాలో మెగాస్టార్‌కి ఐదుగురు చెల్లెళ్లుంటారట.
ఇప్పటికే నటీమణులు ఈషా రెబ్బా, రమ్య పసుపులేటి, సురభి పురాణిక్ విశ్వంభర సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు.
దర్శకుడు వశిష్ట డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్, వింటేజ్ చిరుని పరిచయం చేయడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం కోకాపేటలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మెగాస్టార్ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తున్నారు.
ఆ మధ్య ఫారిన్ ట్రిప్ కోసం కాసింత గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ ఇప్పుడు పూర్తిస్థాయిలో షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిరుకి, విశ్వంభర అచ్చంగా అలాంటి సినిమానే అవుతుందని అంటున్నారు యూనిట్ మెంబర్స్.
బింబిసార తీసిన అనుభవంతో విశ్వంభరను వశిష్ట నెక్స్ట్ లెవల్లో రూపొందిస్తున్నారని చెబుతున్నారు మోవీ మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి