24 November 2023

మాస్ మూవీతో మెగా మేనల్లుడు

ఫస్ట్ సినిమాతోనే వెయ్యి కోట్లు కొల్లగొట్టిన హీరో సినిమా వస్తుందంటే, అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించినట్టున్నారు. 

అందుకు తగ్గట్టే బొమ్మను రెడీ చేశారు ఆదికేశవ మేకర్స్. ట్రైలర్‌ చూస్తే పక్కా ఎంటర్‌టైనర్‌ అని ఫిక్సయిపోవచ్చన్నది వినిపిస్తున్న పాజిటివ్‌ బజ్‌. 

పక్కా కలర్‌ఫుల్‌సబ్జెక్ట్ గా డిజైన్‌ చేశారు ఆదికేశవను. ట్రైలర్‌ చూసిన వారికి కలిగే ఫస్ట్ ఇంప్రషన్‌ ఇదే మరి. 

స్టార్ట్ టు ఎండింగ్‌ సరదా డైలాగులతో ఎంటర్‌టైనింగ్‌గా, వైష్ణవ్‌ - శ్రీలీల కనిపించిన షాట్లతో కలర్‌ఫుల్‌గా, రాధిక డైలాగులతో ఇంట్రస్టింగ్‌ గా అనిపించింది ట్రైలర్‌. 

రాయలసీమ యాసలో వైష్ణవ్‌ చెప్పిన డైలాగులు కంటెంట్‌ మీద ఇంట్రస్ట్ పెంచుతున్నాయి. 

ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ మూవీ.. మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు