తమిళ్‌లో స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న శ్రీలీల

Rajeev 

12 SEp 2024

'పెళ్లి సందడి' సినిమాతో పరిచయం అయిన శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న ఈ అమ్మడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమా నిరాశ పరిచిన ఆ తర్వాత వచ్చిన ఆఫర్లు, సక్సెస్‌ల కారణంగా టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్ హీరోయిన్ గా మారింది.

టాలీవుడ్‌ లో రవితేజ తో ఒక సినిమా, పవన్ కు జోడీగా ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది ఈ అమ్మడు. 

టాలీవుడ్‌ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న శ్రీలీల బాలీవుడ్, తమిళ్ పై కూడా కన్నేస్తుంది ఈ చిన్నది. 

శ్రీలీల చేతిలో ప్రస్తుతం ఉన్న పెద్ద సినిమాలకు తోడు కెరీర్‌ లోనే పెద్ద సినిమా ఈ అమ్మడి చేతికి వచ్చిందని తెలుస్తోంది. 

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ తో ఒక సినిమాలో నటించే అవకాశం ఈ అమ్మడికి దక్కిందని  తెలుస్తోంది. 

తమిళ్‌ లో శ్రీలీల మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించే అవకాశం రావడం మాములు విషయం కాదు.