04 January 2024

వావ్ గుడ్‌ న్యూస్... ముందుగానే OTTలోకి యానిమల్

TV9 Telugu

గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తి నెలకొంది.

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి.  జనవరి 26న స్ట్రీమింగ్ అవుతుందంటూ  ప్రచారం జరిగింది.

అయితే ఈ సినిమా ఇప్పుడు అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.

యానిమల్ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.

ఇక యానిమల్ సినిమాను జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.

త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారు.