ఎవర్‌గ్రీన్ పెయిర్‌గా గుర్తుండి పోతారా.?

12 November 2024

Battula Prudvi

హను రాఘవపూడి తన అన్ని చిత్రాలలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా అందంగా చూపించడంలో బెస్ట్.

పడి పడి లేచె మనసులో శర్వానంద్, సాయి పల్లవి జోడి సూపర్. అలాగే సీతా రామంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ గురించి ఎంత మాట్లాడిన తగ్గువే.

అలాంటి మరో పెయిర్‎ని ప్రభాస్, ఇమాన్ ఇస్మాయిల్ జంటతో సిల్వర్ స్క్రీన్‎పై మరోసారి కెమిస్ట్రీ క్రియేట్ చేయనున్నారు.

హను రాఘవపూడి ప్రభాస్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.

ఈ చిత్రంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమాన్ ఇస్మాయిల్ (ఇమాన్వి) కథానాయకిగా పరిచయం అవుతుంది. ఫౌజీ అనే టైటిల్ ప్రసారంలో ఉంది.

ఇప్పటివరకు చిత్రీకరించిన సీక్వెన్స్‌లలో ప్రభాస్ & ఇమాన్వి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి దర్శకుడు, బృందం చాలా ఆకర్షితులు అయ్యారట.

ఇటీవల చిత్రీకరించిన ఓ పాటలో ఇమాన్వి డ్యాన్స్ మూవ్స్‌తో బృందం చాలా సంతృప్తి చెందింది. 2025 చివరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమా విడుదల తర్వాత ఎవర్‌గ్రీన్ పెయిర్‌గా ప్రభాస్, ఇమాన్వి గుర్తిండిపోతారని చిత్ర యూనిట్ తెలిపింది.