14 February 2024

సూపర్ డూపర్ హిట్టు సినిమా మిస్ చేసుకున్న పూజా హెగ్డే 

TV9 Telugu

ప్రతీ గింజెపై తినేవాడి పేరు రాసుందంటారు. అలాగే ఎవరికి రాసిపెట్టిన సినిమా వారి చేతుల్లోకి పోతుంది అంటారు.

ఇండస్ట్రీలో కామన్ అయిన ఈ లైన్స్ ఇప్పుడు పూజాకు మంచి హిట్‌ దూరం అయ్యేలా చేసింది.  తన ఫ్యాన్స్‌ను విపరీతంగా బాధపెట్టేస్తోంది.

హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ , మృణాల్ ఠాకూర్ చేసిన ఫిల్మ్ సీతారామం. అందమైన ప్రేమ కథగా... అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది.

మొదట దర్శకుడు హనురాఘవాపుడి సీతారామం సినిమా కోసం అనుకుంది మృణాల్‌ను కాదట.. పూజా హెగ్డేని ఎంపిక చేశాడట..

అయితే ఆ తర్వాత అప్పటికే స్టార్ అయిన పూజా ఈ పాత్రలో సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ వచ్చిందట మేకర్స్ కు..

కొత్త అమ్మాయి అయితే చక్కగా సెట్ అవుతుందని పూజా హెగ్డేను హోల్డ్ లో పెట్టారట దర్శకుడు హను. ఆ తర్వాత మృణాల్ లైన్ లోకి వచ్చిందట.

ఇలా పూజా హెగ్డే చేతిలో నుంచి సీతారామం సినిమా జారిపోయింది. తన ఖాతాలో ఓ సూపర్ డూపర్ హిట్టు లేకుండా పోయింది.