అదృష్టం అంటే ఈ భామదే.. ఆ స్టార్ హీరో సినిమాలో కృతి 

TV9 Telugu

07 July 2024

ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ను ముంచేసిన అందం కృతి శెట్టి. 

తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

ఆతర్వాత ఈ చిన్నది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కృతి. 

శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. 

ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాదాపు అరడజన్ సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. 

రీసెంట్ గా మనమే సినిమాతో ఓకే అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఓ క్రేజీ ఆఫర్ అందుకుందని తెలుస్తోంది.

మలయాళ స్టార్ హీరోదుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా కృతి నటిస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం దుల్కర్ తెలుగులో వరుసగా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారట.