TV9 Telugu

08 February 2024

హిందీ బేబీలో హీరోయిన్‌గా శ్రీదేవీ కూతురు.!

కంటెంట్ బాగుంటే చాలు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియడానికి బేబి సినిమా ఒకటి చాలు.

సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆనంద్ దేవర కొండ , వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్ గా నటించారు.

అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. యవతను ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు సాయి రాజేష్.

అయితే బాలీవుడ్ లోనూ సాయి రాజేశే దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది. మార్పులు లేకుండా అదే కథను హిందీలోనూ తెరకెక్కించనున్నారు సాయి రాజేష్.

అంతే కాదు ఈ సినిమాకు ‘కల్ట్‌ బొమ్మ’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారట. బేబీ మూవీ నిర్మాత ఎస్‌కేఎన్‌ ఈ సినిమాను హిందీలోనూ నిర్మిస్తున్నారు.

అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఇప్పుడు బేబీ అంతే రేంజ్ లో హిట్ అవుతుందని తెలిపారు ఎస్‌కేఎన్‌.

ఇక బేబీ మూవీ రీమేక్ లో హీరోయిన్ గా స్టార్ కిడ్ నటిస్తుందని తెలుస్తోంది. వైష్ణవి చైతన్య పాత్రలో శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ నటిస్తుందని లీక్.

బోనీ కపూర్‌ కానీ, కరణ్‌ జోహార్‌ కానీ ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.